Friday, January 28, 2022

MS Dhoni : నెట్ ప్రాక్టీస్‌లో దుమ్ములేపిన ధోని.. అన్నీహెలికాప్టర్ షాట్సే.. వైర‌ల్ వీడియో | The Telugu News

MS Dhoni : కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( IPL)-2021 వాయిదా పడిన విషయం తెలిసిందే. తిరిగి సెప్టెంబరు 19న దుబాయ్ వేదికగా పునః ప్రారంభమైంది. అయితే, ఐపీఎల్ ఫైనల్ తుది అంకానికి చేరకుంది. అక్టోబర్-15 శుక్రవారం (నేడు) జరగనుంది. తొమ్మిదవ సారి ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. ఈ సీజన్‌లో మొదట పేలమైన ఆటతీరును కనబరిచి, చివరగా ఫైనల్‌కు చేరిన కోల్‌కత్తా నైట్ రైడర్స్ (kkr) జట్టుతో తలపడనుంది. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో జరిగే ఈ ఇంట్రెస్టింగ్ చివరి పోరు కోసం ఐపీఎల్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇకపోతే సీఎస్కే ఫ్యాన్స్ తలా ఈజ్ బ్యాక్ అంటూ ధోనిని పొగడ్తల వర్షంతో ముంచెత్తుతున్నారు. అందుకు కారణం తొలి క్వాలిఫైయర్ -1 మ్యాచ్ లో ధోని తనదైన శైలిలో ఫినిషింగ్ గేమ్ ఆడి ఢిల్లీని చిత్తుగా ఓడించడమే.

MS Dhoni Is Practising Helicopter Shots In Nets

MS Dhoni : టైటిల్‌పై కన్నేసిన ధోని సేన

ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకున్న ధోని సేన టైటిల్‌ సాధించాలన్న కసితో ఉన్నట్టు తెలిసింది. అందుకోసమే మాజీ చాంపియన్లు ప్రాక్టీసులో తలమునకలయ్యారు. ఈ క్రమంలో చెన్నై జట్టు కుర్రాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను సీఎస్కే మేనేజ్మెంట్ సోషల్ మీడియాలో షేర్‌ చేసింది. అది కాస్త కొద్ది గంటల్లోనే తెగ వైరలైంది. సీఎస్కే అభిమానులనే కాకుండా ముఖ్యంగా ధోని ఫ్యాన్స్‌ను ఈ వీడియో తెగ ఆకట్టుకుంటోంది.

MS Dhoni Is Practising Helicopter Shots In Nets
MS Dhoni Is Practising Helicopter Shots In Nets

ఇందులో మిస్టర్‌ కూల్‌, సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన ఐకాన్ షాట్స్.. ‘హెలికాప్టర్‌ షాట్స్‌’ను ప్రాక్టీసు చేయడాన్ని మనం చూడవచ్చు. మరో కీలక ప్లేయర్ సురేశ్‌ రైనా సైతం ఈ వీడియోలో కనిపించడంతో ఫైనల్ మ్యాచ్‌లో అతడు ఆడుతాడా లేదా అని అభిమానుల్లో టెన్షన్ నెలకొంది. ఒకవేళ రైనా ఆడకపోతే మళ్లీ రాబిన్‌ ఊతప్ప వైపే ధోని మొగ్గు చూపుతాడేమో అని నెటిజన్లు చర్చిస్తున్నారు. ఏదేమైనా ఇవాళ జరిగే ఫైనల్ మ్యాచ్‌లో సీఎస్కే జట్టు ఎలాంటి ప్రదర్శన చేస్తుందో వేచిచూడాల్సిందే.Related Articles

Samantha:పడిపోయినా లేచి నిల్చున్నాను.. వదిలేయాలని ఆలోచన వచ్చినా వదిలిపెట్టలేదు.. సమంత పోస్ట్ వైరల్..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్రకథాయికలలో సమంత (Samantha) ఒకరు. ఓవైపు వరుస సినిమాలతో ...

మొగిలయ్యకు కోటి రూపాయలు ప్రకటించిన కేసీఆర్

కేంద్ర ప్రభుత్వం ఇటీవలె దర్శనం మొగులయ్యకు పద్మ శ్రీ పురస్కారాన్ని అందించింది. తాజాగా సీఎం కేసీఆర్ దర్శనం మొగులయ్యకు కోటి రూపాయల రివార్డను ప్రకటించారు. పద్మశ్రీ దర్శనం మొగిలయ్య కు హైద్రాబాద్...

కేరళలో కరోనా విజృంభణ.. ఒక్కరోజులోనే 54 వేలకుపైగా కేసులు , 353 మంది మృతి

కేరళలో కరోనా ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో 54 వేల 537 కేసులు నమోదయ్యాయి. కరోనాతో 352 మంది చనిపొయారు. రాష్ట్రంలో కోవిడ్ బాధితుల సంఖ్య 58,81,133కి చేరుకుంది....

Latest Articles

పవన్ కళ్యాణ్‌ను మించి విజయ్‌కి రెమ్యూనరేషన్.. దిల్ రాజు లెక్కలు వేరే లెవెల్

దళపతి స్టార్డం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విజయ్ సినిమాలు కోలీవుడ్‌లోనే కాకుండా సౌత్ అంతా కూడా ప్రభావాన్ని చూపుతుంటాయి. తమిళంలో తరువాత విజయ్‌కి తెలుగులో అత్యధిక మార్కెట్...

Viral Video: పెళ్లి చేసుకోవడానికి ఎంతో అందంగా ముస్తాబైన వధువు.. కానీ పాపం..

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. తమ వివాహాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవాలని.. ...