Sunday, January 23, 2022

Intinti Gruhalakshmi 15 Oct Today Episode : ప్రేమ్.. శృతిని ప్రేమిస్తున్నాడని జీకేకు చెప్పిన తులసి.. షాక్ అయిన జీకే, అక్షర

Intinti Gruhalakshmi 15 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు ఎపిసోడ్ 15 అక్టోబర్, 2021, శుక్రవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎలాగైనా ప్రేమ్, అక్షర పెళ్లి ఆపాలని నిశ్చయించుకున్న తులసి.. వెంటనే ఇంటికి బయలుదేరుతుంది. శృతిని నందు రూమ్ లో బంధించిన విషయం తెలుసుకున్న తులసి ఆటోలో కూర్చొని శృతికి ఫోన్ చేస్తుంది. కానీ.. శృతి ఫోన్ లిఫ్ట్ చేయదు. మరోవైపు ముహూర్తం మించిపోతుంటుంది. కన్యాదానం చేయడానికి పెళ్లికొడుకు, పెళ్లికూతురు తల్లిదండ్రులు రండి అని పూజారి పిలుస్తాడు.

intinti gruhalakshmi serial 15 october 2021 episode

ఇంతలో తులసి కనిపించదు. ఏమైంది నందు గారు.. తులసి ఏది అని అడుగుతాడు జీకే. చూసొస్తా అని చెప్పి వెళ్తాడు నందు. తులసి కనిపించడం లేదు. తులసి ప్లేస్ లో లాస్యను కూర్చోబెడదాం. కార్యక్రమం జరిపించేద్దాం అంటాడు నందు. దీంతో జీకేకు తీవ్రంగా కోపం వస్తుంది. డాడీ అలా వద్దు.. తులసి ఆంటియే రావాలి అని అక్షర కూడా అంటుంది. విన్నారుగా.. తులసి లేకపోతే నా కూతురు ఈ కన్యాదానమే వద్దన్నది. ఆంటీ లేకుంటే జరిగే పెళ్లి పెళ్లే కాదు.. అని అంటుంది అక్షర.

మరోవైపు శృతికి ఎంత ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయదు. తులసి గారిని అసలు ఈ పెళ్లి ఇష్టం ఉందా లేదా.. నాకు తెలియాలి అని జీకే నందును నిలదీస్తాడు. దీంతో బావగారు అలా మాట్లాడుతున్నారు ఏంటి.. అంటాడు. నందు.. నేనీ పెళ్లికి పెట్టిన ఒకే ఒక కండీషన్.. మీరు, తులసి ఇద్దరు కలిసి ఈ పెళ్లి జరిపించాలని చెప్పా కదా అంటాడు జీకే. కానీ.. తులసి గారు ఇక్కడ లేరు.. అని జీకే సీరియస్ అవుతాడు. ఇంతలో నందు తులసికి ఫోన్ చేయడంతో కట్ చేస్తుంది తులసి.

వెంటనే ఇంటికి వెళ్లి.. శృతి.. శృతి అని పిలుస్తుంది తులసి. ఆంటి వచ్చినట్టుంది అని అనుకుంటుంది శృతి. పెళ్లి టైమ్ లో అక్కడ ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అనుకుంటుంది శృతి. ఖచ్చితంగా నా మనసు మార్చడానికే వచ్చి ఉంటారు. పెళ్లి మండపానికి తీసుకెళ్లేందుకే వచ్చి ఉంటారు.. అని అనుకుంటుంది శృతి. దీంతో రూమ్ లో ఉండి.. అస్సలు రెస్పాండ్ కాదు.

Intinti Gruhalakshmi 15 Oct Today Episode : నందు ఫోన్ ను కట్ చేసిన తులసి

మరోవైపు తులసి ఫోన్ కట్ చేస్తుందని నందు.. చెబుతాడు. నువ్వుయినా కాల్ చేయి అని ప్రేమ్ కు చెప్పినా.. ప్రేమ్ కూడా వద్దు అంటాడు. అమ్మ నన్ను అలా మధ్యలో వదిలిపెట్టదు.. తప్పకుండా వస్తుంది అని చెబుతాడు ప్రేమ్.

మరోవైపు శృతి రాసిన లెటర్ దొరుకుతుంది తులసికి. అది ప్రేమ్ కోసం రాసుకున్న ప్రేమ లేఖ. ఆ లేఖను చదివి తుసలి మరింత భావోద్వేగానికి గురవుతుంది. ఇక.. తప్పని పరిస్థితుల్లో జీకేనే తులసికి ఫోన్ చేస్తాడు. అదే సమయంలో శృతికి ఫోన్ చేస్తుంది తులసి. తన ఫోన్ సౌండ్ విని తను ఏ రూమ్ లో ఉందో కనిపెడుతుంది. అంత అరుస్తున్నా నువ్వు ఎందుకు మాట్లాడటం లేదు. అసలు నీ మనసులో ఏముంది అని అని గట్టిగానే ప్రశ్నిస్తుంది తులసి.

intinti gruhalakshmi serial 15 october 2021 episode
intinti gruhalakshmi serial 15 october 2021 episode

కట్ చేస్తే.. తులసి పెళ్లి మండపం వద్దకు వస్తుంది. జీకే ఏమైందని అడుగుతాడు. ప్రేమ్ శృతిని ప్రేమించాడు అని చెబుతుంది తులసి. దీంతో జీకే షాక్ అవుతాడు. శృతి కూడా ప్రేమ్ ను ప్రేమించింది అని చెబుతుంది. అక్షర కూడా ఈ విషయం వింటుంది. మరి వాళ్లిద్దరు ప్రేమించుకున్నప్పుడు అక్షర పరిస్థితి ఏంటి అని అడుగుతాడు జీకే. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.

Related Articles

మూడో వ‌న్డే కూడా పాయే… క్లీన్‌స్వీప్‌ చేసిన సౌతాఫ్రికా

టీమిండియా ప‌రాజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది.. జ‌ట్టులో మార్పుల ఎఫెక్టేనో.. లేదా విదేశీ గ‌డ్డ‌పై ఆడ‌లేక‌పోయారో.. లేక కోవిడ్ టెన్ష‌న్ ఏమైనా ప‌ట్టుకుందో తెలియ‌దు కాని.. మ‌న వాళ్లు ప్ర‌తీ మ్యాచ్‌లోనూ...

‘పుష్ప’ మేనియా.. తగ్గేదే లేదంటున్న బంగ్లా క్రికెట‌ర్‌..

ఇప్పుడు ఎక్క‌డా చూసినా.. చిన్న నుంచి పెద్ద వ‌ర‌కు.. సంద‌ర్భం ఏదైనా కావొచ్చు త‌గ్గేదే లే అంటూ డైలాగ్ వ‌దులుతున్నారు.. అదంతా పాన్ ఇండియా మూవీ ఈ మ‌ధ్యే విడుద‌ల పుష్ఫ...

RC 15లో శ్రీకాంత్.. క్యారెక్టర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు !

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా వ‌ర్కింగ్ టైటిల్ . బాలీవుడ్...

Latest Articles

UP Elections: యూపీలో బీజేపీకి మరో షాక్.. ఎస్పీలో చేరిన ఫతేహాబాద్‌ ఎమ్మెల్యే జితేంద్ర వర్మ

fatehabad mla Jitendra varma: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది పార్టీల్లో అసమ్మతినేతల తాకిడి ఎక్కువవుతోంది....

Nandamuri Bala Krishna : ‘అఖండ’ OTT రికార్డ్.. నందమూరి ఫ్యాన్స్‌కి ట్రీట్!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ ‘అఖండ‌’. ద్వారకా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ వైపు కోవిడ్ ప‌రిస్థితులు.. మ‌రో...