Tuesday, January 25, 2022

24 నుంచి స్కూళ్లు ప్రారంభం.. పిల్లల్ని పంపించం అంటున్న పేరెంట్స్

మహారాష్ట్రలో సోమవారం నుంచి పున:ప్రారంభం కానున్నాయి. జనవరి 24 నుంచి జిల్లాల వారీగా స్కూళ్లు తెరుచుకోనున్నాయి. తొలుత ముంబై, నాసిక్, థానే, నందుర్బార్, జలగావ్‌లో పాఠశాలలు ప్రారంభమవుతాయి. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే నాగ్‌పూర్‌లో జనవరి 26, ధూలేలో జనవరి 27 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. పూణే, అహ్మద్‌నగర్‌లో స్కూళ్ల ప్రారంభంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

పాఠశాలల ప్రారంభంపై ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. తరగతులకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా వారి తల్లిదండ్రుల నుంచి పర్మిషన్ లెటర్‌ను తీసుకెళ్లాల్సి ఉంటుంది. వారి అనుమతి ఉంటేనే విద్యార్థులను స్కూల్‌కు రానిస్తారు. అయితే అక్కడ పిల్లలను బడులకు పంపించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో సగానికిపైగా తల్లిదండ్రులు తమ పిల్లల్ని బడికి పంపించేందుకు సిద్ధంగా లేరని తేలింది.

ఆన్‌లైన్ కమ్యూనిటీ ఫ్లాట్‌ఫామ్ లోకల్ సర్కిల్ రాష్ట్రంలోని పలు నగరాల్లో 4976 మందిని అభిప్రాయాలను తెలుసుకుంది. ఈ సర్వేలో 62 శాతం మంది తమ పిల్లల్ని సోమవారం నుంచి బడులకు పంపించేందుకు సిద్ధంగా లేమని చెప్పారు. 11 శాతం మంది మాత్రం పిల్లలను స్కూలుకు పంపించేందుకు అంగీకరించారు. ఇంకో 11 శాతం మంది అసలు ఏ అభిప్రాయాన్ని చెప్పలేకపోయారు.

ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి కారణంగా రాష్ట్రంలో కేసులు పెరగడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 15 వరకు రాష్ట్రంలో అన్ని పాఠశాలలను, కళాశాలలను మూసివేయాలని జనవరి 8న ఆదేశించింది. అయితే జనవరి 20న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రాష్ట్రంలోని 1 నుంచి 12వ తరగతి వరకూ పాఠశాలలను జనవరి 24 నుంచి పున:ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. కాగా మహారాష్ట్రలో కేసులు ఎక్కువగానే నమోదవుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో శనివారం 46,393 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇన్ని కరోనా కేసులు ఉంటుండగా స్కూళ్లు తెరవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

Related Articles

పెళ్లైన రోజే పోలీస్ స్టేషన్‌‌కు వధూ,వరులు… కోవిడ్ ఆంక్షలు ఉల్లంఘించారని అరెస్ట్

ప్రధానాంశాలు:గుజరాత్‌‌లో కొత్త పెళ్లి జంట అరెస్ట్అర్ధరాత్రి సమయంలో ఇంటికి వస్తున్న కుటుంబంకోవిడ్ ఆంక్షలు ఉల్లంఘించారని ఆరోపణగుజరాత్‌లో అప్పుడే పెళ్లైన ఓ జంటను కోవిడ్ ఆంక్షలు కష్టాల్లో పడేశాయి. నైట్ కర్ఫ్యూను ఉల్లంఘించినందుకు...

Padma Awards 2022 : మొగులయ్యకు పద్మశ్రీ.. స్పందించిన పవన్ కళ్యాణ్

ప్రధానాంశాలు:పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రంకిన్నెర వాయిద్య కారుడు మొగులయ్యకు పద్మశ్రీపద్మ అవార్డులపై స్పందించిన పవన్ కళ్యాణ్భీమ్లా నాయక్ పాటతో దర్శనం మొగులయ్య గొప్పదనం, కిన్నెర వాయిద్య పరికరం గురించి నేటి తరానికి...

నా భార్య నమితకి శరత్‌ బాబుతో పెళ్లేంటి?.. మా లైఫ్‌లో ఇదే వరస్ట్: నమిత భర్త వీరూ చౌదరి ఫస్ట్ రియాక్షన్

గుజరాతీ భామ నమితకి తెలుగు, తమిళ్‌లో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తమిళనాడులో అయితే ఈ బొద్దుగుమ్మకి ఏకంగా గుడిలే కట్టిపూజించేశారు. తెలుగులో సొంతం, జెమిని, బిల్లా, సింహా వంటి చిత్రాల్లో...

Latest Articles

పద్మ అవార్డుల ప్రకటన.. బిపిన్‌ రావత్‌కు పద్మవిభూషణ్‌, 17 మందికి పద్మభూషణ్

ప్రధానాంశాలు:128 మందికి పద్మ అవార్డులు17 మందికి పద్మభూషణ్107 మందికి పద్మశ్రీ పురస్కారాలుగణతంత్ర దినోత్సవం సందర్భంగా పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. పద్మ అవార్డుల...

Gudivada Casino Politics: గోవా కల్చర్ ఏంటో?.. బీజేపీ నేతకు మంత్రి నాని స్ట్రాంగ్ కౌంటర్..

Casino Politics - Minister Nani: బీజేపీ(BJP) ఆంధ్రప్రదేశ్(Andhra PradesH) అధ్యక్షుడు సోము వీర్రాజుపై మంత్రి కొడాలి.. ...