Friday, January 28, 2022

Huzurabad bypoll : టీఆర్ఎస్ ను ఓడించడం కోసం.. కాంగ్రెస్, బీజేపీ డేర్ స్టెప్? వర్కవుట్ అవుతుందా? | The Telugu News

Huzurabad bypoll  ఇప్పుడు టీఆర్ఎస్ నేతల్లో ఈ భ‌య‌మే వ్య‌క్తం అవుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్, బీజేపీలు ఫిక్సింగ్ చేసుకుంటాయ‌ని, టీఆర్ఎస్ ను దెబ్బ‌కొట్టే వ్యూహంతో ఆ రెండు పార్టీలూ లోలోప‌ల చేతులు క‌లుపుతాయ‌ని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ పై ధిక్కార ప‌తాకాన్ని ఎగ‌రేసిన ఈట‌ల రాజేంద‌ర్ కు లోపాయికారీగా స‌హ‌క‌రించ‌డం ద్వారా ప్ర‌తీకారం తీర్చుకోవ‌చ్చ‌నేది కాంగ్రెస్ భావిస్తోందని టీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నారు. టీఆర్ఎస్ ను ఓడించ‌డం అనే ఉమ్మ‌డి ల‌క్ష్యం మేర‌కు ఈట‌ల‌ రాజేందర్ కు రేవంత్ రెడ్డి స‌హ‌కారం అందిస్తారని టీఆర్ఎస్ నేత‌లు అంటున్నారు. అందుకే తెలంగాణ వ్యాప్తంగా ఎక్క‌డెక్క‌డో తిరుగుతున్న రేవంత్ రెడ్డి హుజూరాబాద్ కు రావ‌డం లేద‌ని చెబుతున్నారు.

inugala peddireddy may be Joine congress
inugala peddireddy may be Joine congress

బీజేపీ ప్రత్యామ్నాయంగా.. Huzurabad bypoll

ఈ వాద‌న బాగానే ఉంది కానీ, ఈట‌ల రాజేందర్ గెల‌వ‌డం వ‌ల్ల టీఆర్ఎస్ ఓడిపోవ‌చ్చేమో కానీ, కాంగ్రెస్ కు వ‌చ్చే ప్ర‌యోజ‌నం ఏమీ లేదన్నది విశ్లేషకుల అంచనా. ఇప్పుడు తెలంగాణ‌లో టీఆర్ఎస్ గెలిచినా ఫ‌ర్వాలేదు కానీ, బీజేపీ గెల‌వ‌డం వ‌ల్ల‌నే కాంగ్రెస్ కు ఎక్కువ న‌ష్టం.. ఎందుకుంటే టీఆర్ఎస్ కు తామే ప్ర‌త్యామ్నాయం అనే బీజేపీ ప్ర‌చారం చేసుకుంటోంది. మరి ఆ సమయంలో బీజేపీని గెలిపిస్తే, కాంగ్రెస్ కు ఏమాత్రం మేలు జరుగుతుందన్నది వీరి వాదన. అంతేగాక 2023లో టీఆర్ఎస్ ను ఓడించి అధికారంలోకి వచ్చేది తామేన‌ని ప్ర‌క‌టించుకుంటున్నారు బీజేపీ నేత‌లు. ఇటీవ‌లి జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో కూడా కాంగ్రెస్ అడ్ర‌స్ కోల్పోవ‌డం, బీజేపీ పోటీ ప‌డిన నేప‌థ్యంలో.. టీఆర్ఎస్ కు తామే ప్ర‌త్యామ్నాయం అంటూ బీజేపీ చెప్పుకునేందుకు అవ‌కాశం ఏర్ప‌డింది.

congress leader dasoju shravan reveals truths on bengaluru drugs case
congress leader dasoju shravan reveals truths on bengaluru drugs case

రెండింటితోనూ పోరు.. Huzurabad bypoll

ఇలాంటి ప‌రిస్థితుల్లో హుజూరాబాద్ లో బీజేపీకి గ‌నుక కాంగ్రెస్ స‌హ‌కారం అందిస్తే ఆ పార్టీ త‌నంతట తానే గొయ్యి తవ్వుకున్నట్లని విశ్లేషకులు అంటున్నారు. టీఆర్ఎస్ గెలిస్తే.. అధికారాన్ని ఉప‌యోగించుకుని గెలిచారంటూ కాంగ్రెస్ తేల్చేయ‌వ‌చ్చు. అదే బీజేపీ గెలిస్తే.. ఆ పార్టీనే ప్ర‌ధాన ప్ర‌తిపక్షంగా మారితే, కాంగ్రెస్ కు అటు టీఆర్ఎస్ తోనూ, ఇటు బీజేపీతోనూ పోరాటం చేయాల్సి వస్తుంది.. ఈ విషయం రేవంత్ రెడ్డికి తెలియకుండా ఉంటుందా అన్నది విశ్లేషకుల ప్రశ్న.. కేవలం ఈటెల రాజేందర్ కోసం బీజేపీ గెలుపును కాంగ్రెస్ కోరుకునేంత దుస్సాహసం చేయదన్నది సర్వత్రా వినిపిస్తోన్న మాట..

Related Articles

పెళ్లి, విడాకుల వార్తలపై హిమజ రియాక్షన్

సోషల్ మీడియాలో రూమర్స్ రావడం అనేది కామన్. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో ఎన్నో రకాల వార్తలు తెరపైకి వస్తుంటాయి. సినీ సర్కిల్స్‌లో వినిపిస్తున్న టాక్ ఆధారంగా వార్తలు పుట్టుకొస్తుంటాయి. ఈ క్రమంలోనే...

ప్రియుడిని పెళ్లాడిన ‘కేజీఎఫ్’ బ్యూటీ మౌనీరాయ్

Mouni Roy Wedding: ప్రియుడిని పెళ్లాడిన 'కేజీఎఫ్' బ్యూటీ మౌనీరాయ్

v23 ఏళ్ల శ్రమ ఫలితం.. తాజ్‌మహాల్‌ను తలపించే భవంతిని కట్టిన విలక్షణ నటుడు

<p><strong>అ</strong>తడు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ప్రాధాన్యం ఉన్న పాత్రలోకి తీసుకోవాలంటే భయపడేవారు. నటీ నటుల వారసులకే పెద్ద పీఠం వేసే బాలీవుడ్&zwnj;లో నెట్టుకు రావడం అంటే అంత సులభం కాదు. నెపొటిజాన్ని...

Latest Articles

‘గుడ్ లక్ సఖి’ మూవీ రివ్యూ: కీర్తీ సురేష్ సినిమా ఎలా ఉందంటే?

Good Luck Sakhi Sports Drama దర్శకుడు: Nagesh Kukunoor Artist: Keerthy Suresh, Aadhi Pinisetty, Jagapati Babu, Rahul Ramakrishna and Others సినిమా రివ్యూ:...

Pushpa: ఇది బాలీవుడ్ తారలకు చెంపపెట్టు! అల్లు అర్జున్‌పై సినీ క్రిటిక్ కామెంట్స్

బాలీవుడ్‌ సినీ క్రిటిక్‌గా గుర్తింపు పొందిన కమల్‌ ఆర్‌ ఖాన్‌ తరచూ వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ బాలీవుడ్ తారలపై విరుచుకుపడుతుంటారు. ఈ...