Sunday, January 23, 2022

KTR : కే‌టి‌ఆర్ మీద భారీ ట్రాలింగ్ .. కే‌సి‌ఆర్ వరకూ వెళ్ళిన టాప్ ట్రాల్ ఫోటో ఇదే ? | The Telugu News

KTR తెలంగాణ‌లో అతి భారీ వ‌ర్షాలు. హైద‌రాబాద్‌లో కుండ‌పోత వాన‌. కేసీఆర్ KCR  ప్ర‌భుత్వం ఏకంగా ఒక‌రోజు సెల‌వు కూడా ఇచ్చేసింది. వ‌ర‌ద ఉధృతి కార‌ణంగా భాగ్య‌న‌గ‌రంలోని ముషారాంబాగ్ బ్రిడ్జిని సైతం మూసేశారు. ముసీ ఉప్పొంగి ప్ర‌వ‌హిస్తోంది. ముసీ గ‌ట్టు మీద ఉన్న వారిని ఖాళీ చేయించి సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. ఎప్ప‌టిలానే లోత‌ట్టు ప్రాంతాల‌న్నీ వ‌ర‌ద నీటిలో మునిగిపోయి ఉన్నాయి. మూడు రోజులుగా న‌ర‌కం చూస్తున్నారు జ‌నాలు. మ‌రి, ఇంత జ‌రిగితే ప‌ట్ట‌ణ‌శాఖ మంత్రి కేటీఆర్ ఎక్క‌డ‌?

KTR Missing Trolling in social media

వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లో ప‌ర్య‌టించ‌రేం? గ‌త‌ంలో హైద‌రాబాద్‌కు వ‌ర‌ద‌లు వ‌చ్చిన‌ప్పుడు కేటీఆర్ న‌గ‌రంలో విస్తృతంగా చ‌క్క‌ర్లు కొట్టారు. కుటుంబానికి 10వేలు కూడా ఇచ్చారు. అప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు ఉండ‌టంతో అలా చేశారంటూ అంతా విమ‌ర్శించారు. ఇప్పుడు ఎన్నిక‌లు లేవు కాబ‌ట్టి ఇటు వైపు కూడా చూడ‌టం లేదంటూ హైద‌రాబాదీలు మండిప‌డుతున్నారు. ఇక జిల్లాల్లోనూ ఇదే తీరుగా ఉంది ప‌రిస్థితి. త‌న సొంత ఇలాఖా సిరిసిల్ల నీట‌మునిగితే వెళ్లి చూశారు కానీ.. మిగ‌తా జిల్లాలు జ‌ల‌మ‌య‌మైతే ప‌ట్టించుకోరా అంటూ మంత్రి కేటీఆర్‌ను నిల‌దీస్తున్నారు బాధితులు.

వాల్ పోస్టర్లతో రచ్చ.. KTR

ఇక భాగ్య‌న‌గ‌ర వాసులు మ‌రో అడుగు ముందుకేసి.. త‌మ‌దైన స్టైల్‌లో నిర‌స‌న తెలిపారు. కేటీఆర్ మిస్సింగ్ అంటూ వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లో పోస్ట‌ర్లు అంటించారు. ఎక్క‌డ వ‌ర‌ద ఉంటే అక్క‌డ కేటీఆర్ మిస్సింగ్ అనే వాల్ పోస్ట‌ర్లు ద‌ర్శ‌న‌మిస్తుండ‌టం అధికార పార్టీని క‌ల‌వ‌ర ప‌రుస్తోంది. పోనీ, వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లో ప‌ర్య‌టిద్దామా అంటే ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ర‌గిలిపోతున్నారు. ఇంకెన్నాళ్లీ దుస్థితి అంటూ నిల‌దీసే ప‌రిస్థితి ఉంది. అందుకే మంత్రి కేటీఆర్‌ అటువైపు క‌న్నెత్తి కూడా చూడ‌టం లేదంటున్నారు. ఆయ‌న రాక‌పోయేస‌రికి కేటీఆర్ మిస్సింగ్ అంటూ పోస్ట‌ర్ల‌తో త‌మ నిర‌స‌న తెలుపుతున్నారు వ‌ర‌ద బాధితులు. గతేడాది వరదలకు నానా ఇబ్బందులు పడ్డామని, ఈసారి అదే పరిస్థితి తలెత్తిందని వాపోతున్నారు. దీనికి టీ సర్కార్ .. పరిష్కారం చూడటం లేదంటూ వీరంతా తమ ఆవేదనను ఈ రూపంలో వ్యక్తం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

ktr speaks to media in warangal about govt jobs
ktr speaks to media in warangal about govt jobs

సోషల్ మీడియాలోనూ.. KTR

మ‌రికొంద‌రు ఆ పోస్ట‌ర్ల‌కు వ‌ర‌ద విజువ‌ల్స్ కూడా జ‌త చేసి.. మీమ్స్‌తో వీడియోలు రెడీ చేసి సోష‌ల్ మీడియాలో వ‌దులుతున్నారు. అవి తెగ వైర‌ల్ అవుతుండ‌టంతో కేటీఆర్ ఫుల్‌గా బ‌ద్నామ్ అవుతున్నారు. పోతే ఓ లొల్లి. పోక‌పోతే ఇంకో లొల్లి. ఇదేందిబై అంటూ కేటీఆర్ ప్ర‌గ‌తి భ‌వ‌న్ వీడి బ‌య‌ట‌కు రావ‌ట్లేదని అంటున్నారు. ఏదేమైనా వరదల్లో భాగ్యనగరం అతలాకుతలం అవుతుంటే, పట్టణ శాఖ మంత్రిగా ఉండి, కనీసం పట్టించుకోవడం లేదన్న ఆవేదన, ఆగ్రహం ప్రతిరూపమే ఈ వాల్ పోస్టర్లు, మీమ్స్ .. అని టాక్ నడుస్తోంది. కానీ ఈ సమస్య కేటీఆర్ శాఖకు చెందిందే, అయినా, పూర్తిస్థాయి పరిష్కారం లభిస్తేనే, ఏమైనా చేయగలమన్నది.. అదేమీ .. అంత ఆషామాషీ కాదని విశ్లేషకులు అంటున్నారు. దీనిపై టీ సర్కార్ ఓ ప్రత్యేక ప్రణాళిక రూపొందించి, అడుగులు వేస్తేనే, పరిష్కారం అవుతుందన్న విషయం తెలిసిందే.

Related Articles

మూడో వ‌న్డే కూడా పాయే… క్లీన్‌స్వీప్‌ చేసిన సౌతాఫ్రికా

టీమిండియా ప‌రాజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది.. జ‌ట్టులో మార్పుల ఎఫెక్టేనో.. లేదా విదేశీ గ‌డ్డ‌పై ఆడ‌లేక‌పోయారో.. లేక కోవిడ్ టెన్ష‌న్ ఏమైనా ప‌ట్టుకుందో తెలియ‌దు కాని.. మ‌న వాళ్లు ప్ర‌తీ మ్యాచ్‌లోనూ...

‘పుష్ప’ మేనియా.. తగ్గేదే లేదంటున్న బంగ్లా క్రికెట‌ర్‌..

ఇప్పుడు ఎక్క‌డా చూసినా.. చిన్న నుంచి పెద్ద వ‌ర‌కు.. సంద‌ర్భం ఏదైనా కావొచ్చు త‌గ్గేదే లే అంటూ డైలాగ్ వ‌దులుతున్నారు.. అదంతా పాన్ ఇండియా మూవీ ఈ మ‌ధ్యే విడుద‌ల పుష్ఫ...

RC 15లో శ్రీకాంత్.. క్యారెక్టర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు !

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా వ‌ర్కింగ్ టైటిల్ . బాలీవుడ్...

Latest Articles

UP Elections: యూపీలో బీజేపీకి మరో షాక్.. ఎస్పీలో చేరిన ఫతేహాబాద్‌ ఎమ్మెల్యే జితేంద్ర వర్మ

fatehabad mla Jitendra varma: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది పార్టీల్లో అసమ్మతినేతల తాకిడి ఎక్కువవుతోంది....

Nandamuri Bala Krishna : ‘అఖండ’ OTT రికార్డ్.. నందమూరి ఫ్యాన్స్‌కి ట్రీట్!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ ‘అఖండ‌’. ద్వారకా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ వైపు కోవిడ్ ప‌రిస్థితులు.. మ‌రో...