Wednesday, January 19, 2022

317 GO : 317 జీవోపై వినూత్న నిరసన.. తాతా అంటూ కేసీఆర్‌కు సూటి ప్రశ్న? | The Telugu News

317 GO : తెలంగాణ సర్కారు తీసుకొచ్చిన 317 జీవోను ఉద్యోగులు, ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే, టీఆర్ఎస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది. ఈ జీవో విషయమై ఉద్యోగులు ప్రతీ రోజు ఏదో ఒక రూపంలో నిరసన తెలుపుతూనే ఉన్నారు. కాగా, ఈ సారి ఉద్యోగుల పిల్లలు తాము 317 జీవో వలన ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కేసీఆర్ ను ప్రశ్నించారు. సంక్రాంతి సందర్భంగా ముగ్గుతో వినూత్న నిరసన తెలిపారు.సంక్రాంతి సందర్భంగా అందరూ ఇళ్ల ఎదుట ముగ్గులు వేసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే ముగ్గు ద్వారా కూడా నిరసన తెలపాలనే ఉద్దేశంతో ముగ్గు వేశారు. సదరు ముగ్గులో ఆదిలాబాద్ కు చెందిన చిన్నారులు తమ ప్రశ్నలు కూడా సంధించారు. తమ తల్లికి ఒక జిల్లా, తండ్రికి మరో జిల్లా కేటాయించడంతో తమ పరిస్థితి ఏంటని ఈ సందర్భంగా వారు వినూత్న రీతిలో విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని చిన్నారులు ముగ్గులో రాశారు.తాము ఏ జిల్లాకు వెళ్లాలి అని కేసీఆర్‌ను తాత అని సంబోధిస్తూ అడిగారు. ఈ క్రమంలోనే తమ తల్లిదండ్రులను తమ నుంచి విడదీయొద్దని, తమ వద్దే ఉంచాలని కోరారు.

317 go children request to cm kcr on 317 go

317 GO : చేతులు జోడించి.. ముగ్గు వద్ద కూర్చొని కేసీఆర్‌కు వినతి..

ముగ్గులో వారి హ్యాపీ పొంగల్ అని ఇంగ్లిష్ అక్షరాలతో రాసిన క్రమంలో ఎడమ వైపున ‘అమ్మ ఒక జిల్లా.. నాన్న ఒక జిల్లా.. నేను ఏ జిల్లా… కేసీఆర్ తాతా? ’ అని రాశారు. మరో వైపున జీవో నెం.317 స్పౌజ్ బాధితులు ఆదిలాబాద్ అని పేర్కొన్నారు. ఇక ఈ ముగ్గు ముందర ఇద్దరు అమ్మాయిలు చేతులు జోడించి మరి ఫొటోలు దిగారు. ఈ ఫొటోలు ప్రజెంట్ సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. మొత్తంగా ఉద్యోగులే కాదు ఉద్యోగుల పిల్లలు కూడా వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు. ఈ సంగతి ఈ చిన్నారులు చేసిన పని ద్వారా స్పష్టమవుతున్నది.

Related Articles

R Narayanamurthy : జగన్మోహన్ రెడ్డి వల్లే ‘బంగార్రాజు’ సక్సెస్ అయింది | Naranamurthy about Jaganmohanreddy

ఆర్ నారాయణ మూర్తి ఈ సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ.. ''సినిమాని కాపాడాలని సంక్రాంతికి లాక్ డౌన్, కర్ఫ్యూ పెట్టకుండా అన్ని షోలకు పర్మిషన్ ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి గారికి...

ఇక వన్డే సమరం.. సిరీస్‌పై టీమిండియా గురి..!

సౌతాఫ్రికా గడ్డపై టెస్ట్‌ సిరీస్‌ కోల్పోయిన టీమిండియా… ఇవాళ్టి నుంచి వన్డే సిరీస్‌ వేట మొదలుపెట్టబోతోంది. మూడు వన్డేల సిరీస్‌కు సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి మొదలయ్యే వన్డేల్లో నెగ్గి.. సిరీస్‌ను గెలవాలన్న...

Horoscope Today: ఈ రోజు ఈ రాశివారు స్త్రీవలన ధన లాభం పొందుతారు.. నేడు ఏ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (19-01-2022): మనిషి జీవితం నమ్మకం ఆధారంగా ముందుకు సాగుతుంది. నేటికీ చాలా మంది ఏ పని...

Latest Articles

Budget 2022: ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే బంగారం ప్రియులకు శుభవార్తే.. అదేంటంటే..!

Budget 2022: బంగారం ప్రియులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పబోతుంది. బంగారంపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని వాణిజ్య ...

Pregnancy and Child Care: ప్రెగ్నెన్సీ సమయంలో అలా చేస్తే.. శిశువుకు తీవ్ర ప్రమాదం..

Consuming alcohol during pregnancy period: గర్భధారణ సమయంలో మహిళలు ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవాలి. ఈ సమయంలో గర్భిణులు...