Wednesday, January 26, 2022

Fish: చేపలు తినే వారికి షాకింగ్ న్యూస్.. ఆ వ్యాధుల బారిన పడే అవకాశముందట.. వివరాలు..Fish Disadvantages: చేపల వినియోగం చాలా ప్రయోజనకరం. అనేక అధ్యయనాల్లో కూడా నిరూపితమైంది. ఎందుకంటే చేపల్లో

Fish

Fish Disadvantages: చేపల వినియోగం చాలా ప్రయోజనకరం. అనేక అధ్యయనాల్లో కూడా నిరూపితమైంది. ఎందుకంటే చేపల్లో ఒమేగా – 3 కొవ్వు (Omega-3 Fatty acid)ఆమ్లాలతో పాటు , అనేక ముఖ్యమైన విటమిన్లు (Vitamins), ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. చేపలను తినడం ద్వారా.. మెదడు కూడా చాలా చురుకుగా ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యంగా ఉంచడంలో చేపలు (Fish) సహకరిస్తాయి. అందుకే ఆరోగ్య నిపుణులు కూడా చేపలను ఎక్కువగా తినాలని సిఫార్సు చేస్తుంటారు. అయితే.. చేపలు శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా పరిగణించబడుతున్నప్పటికీ.. దాని వినియోగం కొన్నిసార్లు హానికరమని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి హాని కలుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

నీటిలో ఉండే పాదరసం, పీసీబీ వంటి రసాయనాలు కూడా చేపల కడుపులోకి వెళ్తాయి. మెర్క్యురీ, పిసిబిలు మన ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. నేరుగా, మీరు పెద్ద పరిమాణంలో చేపలను తింటే అది శరీరంలో పాదరసం, పీసీబీ మొత్తాన్ని పెంచుతుంది. దీంతో అనారోగ్యానికి గురయ్యే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే చేపలు మన ఆరోగ్యం ఎలాంటి హని కలిగిస్తాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం..

మెదడుపై ప్రభావం
చేపలను ఎక్కువగా తినడం వల్ల శరీరంలో పాదరసం లేదా పిసిబి పరిమాణం పెరిగితే.. అది మెదడు లేదా నాడీ వ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు. దీని వల్ల మతిమరుపు వచ్చే ప్రమాదం కూడా ఉంది. కావున పరిమిత పరిమాణంలో చేపలను తీసుకోవడం మంచిదని పేర్కొంటున్నారు నిపుణులు.

గర్భిణీలకు హానికరం
శరీరంపై చేపల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. చేపలు ఎక్కువగా తింటే వేడి చేస్తుంది. కావున గర్భిణిలు కూడా పరిమిత పరిమాణంలో చేపలను తినడం మంచిది. గర్భిణీలు చేపలను ఎక్కువగా తీసుకుంటే గర్భస్రావం అయ్యే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. పరిమిత పరిమాణంలో చేపలు తినడం తల్లి, బిడ్డకు ఉపయోగకరమే కానీ.. తినేముందు వైద్యుడిని లేదా నిపుణుడిని సంప్రదించడం మంచిది.

క్యాన్సర్
చేపలు ఎక్కువగా తినే వారి శరీరంలో అధిక మొత్తంలో పీసీబీ ఉంటుంది. ఈ వ్యక్తులు క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. అధిక పరిమాణంలో చేపలను తినడం ద్వారా శరీరంలో PCB పెరుగుతుంది. దీంతో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.

మధుమేహం
చేపలు ఎక్కువగా తినడం వల్ల శరీరంలోకి చేరిన విషపూరిత పదార్థాలు మధుమేహం సంభవించడానికి కారణమవుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుడా బరువు పెరగడానికి కూడా కారణం కావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Also Read:

Hypertension Side Effects: ఈ ఆహార పదార్ధాలతో హైబీపీకి చెక్ పెట్టొచ్చు.. అవేంటో తెలుసుకోండి.!

Sneezing: తరచూ తుమ్ములతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ సింపుల్ చిట్కాలు మీ కోసమే..

Related Articles

మహేష్ బాబుతో మోహన్ బాబు.. ఇన్నేళ్లకు మళ్ళీ అలా కలవబోతున్నారా?

వరుస హిట్ సినిమాలతో సత్తా చాటుతూ టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. తన తదుపరి సినిమాలో మోహన్ బాబుతో తెర పంచుకోబోతున్నారని తెలుస్తోంది. దర్శకనిర్మాతలతో...

జిల్లా కలెక్టర్ ఆఫీసులలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ – Telugu Job Alerts 24

Collector Office Guntur Recruitment 2022 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, గుంటూరు జిల్లా కలెక్టర్ ఆఫస్ నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా...

చిరంజీవికి కరోనా.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తప్పించుకోలేకపోయానంటూ ట్వీట్…

కరోనా థర్డ్ వేవ్ ఇండస్ట్రీని వణికిస్తోంది. సినిమాల విడుదలకు సంబంధించిన ఇబ్బంది ఓవైపు.. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరగడం మరోవైపు. వెండితెర,...

Latest Articles

గుప్పెడంత మనసు జనవరి26 బుధవారం ఎపిసోడ్: దేవయానికి భారీ షాక్, జగతిని చూసి ఉప్పొంగిన మహేంద్ర మనసు

గుప్పెడంతమనసు జనవరి 26 బుధవారం ఎపిసోడ్ ధరణికి కాల్ చేసి మాట్లాడిన జగతి..ఫుడ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతుంది. ఆ ఫోన్ కాల్ విన్న గౌతమ్...మీరు...

Jairam Ramesh: ఆజాద్, గులాం కాదు .. పద్మ అవార్డు ప్రకటనపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ సెటైర్!

కాంగ్రెస్ సీనియర్ నేత, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్‌కు పద్మభూషణ్ ప్రకటించిన తర్వాత దీనిపై...