Wednesday, January 26, 2022

Malladi Chandrasekhar Shastry: ప్రవచనకర్త చంద్రశేఖర శాస్త్రి అస్తమయంపై జనసేనాని సంతాపం | Malladi Chandrasekhar Shastry expired, venkaiah Naidu, pawan kalyan condolenses

ప్రముఖ పురాణ ప్రవచనకర్త మల్లాది చంద్రశేఖర శాస్త్రి (96) శివైక్యం చెందారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో శుక్రవారం పరమపదించారు.

Malladi Chandrasekhar Shastry: ప్రముఖ పురాణ ప్రవచనకర్త మల్లాది చంద్రశేఖర శాస్త్రి (96) శివైక్యం చెందారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో శుక్రవారం పరమపదించారు. పురాణాలను శాస్త్రబద్ధంగా బోధించడంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఆస్థాన శాశ్వత పండితుడిగా చంద్రశేఖర శాస్త్రి ప్రసిద్ధి కెక్కారు. 1925లో ఆగష్టు 28న గుంటూరుజిల్లా క్రోసూరులో జన్మించారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం:
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మల్లాది చంద్రశేఖరశాస్త్రి పరమపదించడం విచారకరం. ఆధ్యాత్మిక జ్ఞానం, సామాజిక దృక్పథాల సమ్మేళనంగా సాగిన వారి ప్రవచనాలు మార్గనిర్దేశనం చేసేవి అని ట్విట్టర్లో పోస్టు పెట్టి ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సంతాపం:
‘ప్రముఖ పండితులు, ప్రవచనకర్త శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి అస్తమించారనే విషయం బాధ కలిగించింది. ఉగాది రోజున పంచాంగ శ్రవణ కార్యక్రమంలో ఆయన చెప్పే విశేషాలు ప్రతి తెలుగు వ్యక్తికీ చిరపరిచితమే. పురాణ, ఇతిహాస, వేద విశేషాలు ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా, ఆధ్యాత్మిక చింతన పెంచేలా శ్రీ చంద్రశేఖర శాస్త్రి గారి ఉపన్యాసాలు సాగేవి. ధర్మ సందేహాలు, ధర్మ సూక్ష్మాలు కార్యక్రమాల ద్వారా హిందూ ధర్మంపై అవగాహన పెంచారు. ఆత్మకు శాంతి చేకూరాలని, సద్గతులు ప్రాప్తించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’ అని పవన్ కళ్యాణ్ పోస్టు పెట్టారు.

Related Articles

జిల్లా కలెక్టర్ ఆఫీసులలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ – Telugu Job Alerts 24

Collector Office Guntur Recruitment 2022 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, గుంటూరు జిల్లా కలెక్టర్ ఆఫస్ నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా...

చిరంజీవికి కరోనా.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తప్పించుకోలేకపోయానంటూ ట్వీట్…

కరోనా థర్డ్ వేవ్ ఇండస్ట్రీని వణికిస్తోంది. సినిమాల విడుదలకు సంబంధించిన ఇబ్బంది ఓవైపు.. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరగడం మరోవైపు. వెండితెర,...

గుప్పెడంత మనసు జనవరి26 బుధవారం ఎపిసోడ్: దేవయానికి భారీ షాక్, జగతిని చూసి ఉప్పొంగిన మహేంద్ర మనసు

గుప్పెడంతమనసు జనవరి 26 బుధవారం ఎపిసోడ్ ధరణికి కాల్ చేసి మాట్లాడిన జగతి..ఫుడ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతుంది. ఆ ఫోన్ కాల్ విన్న గౌతమ్...మీరు...

Latest Articles

Jairam Ramesh: ఆజాద్, గులాం కాదు .. పద్మ అవార్డు ప్రకటనపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ సెటైర్!

కాంగ్రెస్ సీనియర్ నేత, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్‌కు పద్మభూషణ్ ప్రకటించిన తర్వాత దీనిపై...

Covid 19 : మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్..!

థ‌ర్డ్ వేవ్ ప్ర‌భావం చాలా ఎక్కువ‌గా ఉంది. సామాన్యులు, సెల‌బ్రిటీలు చాలా మంది క‌రోనా బారిన ప‌డుతున్నారు. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో చాలా మంది ప్ర‌ముఖులు క‌రోనా ఎఫెక్ట్‌కి గుర‌య్యారు....