Wednesday, January 26, 2022

రౌడీ బాయ్స్ రివ్యూ: అంచనాలు అందుకోలేకపోయారు – TeluguBulletin.comరౌడీ బాయ్స్ రివ్యూ: అంచనాలు అందుకోలేకపోయారు – TeluguBulletin.com

టాప్ నిర్మాత దిల్ రాజు కుటుంబం నుండి డెబ్యూ చేసిన ఆశిష్ చిత్రం రౌడీ బాయ్స్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దామా.

కథ:

ఇంజనీరింగ్ విద్యార్థి అక్షయ్ (ఆశిష్), మెడికల్ కాలేజ్ స్టూడెంట్ అయిన కావ్య (అనుపమ పరమేశ్వరన్)ను ప్రేమిస్తాడు. ఇంజనీరింగ్, మెడికల్ స్టూడెంట్స్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని తెలిసినా కూడా అక్షయ్ రిస్క్ చేసి వెళ్లి కావ్యకు ప్రపోజ్ చేస్తాడు. అనుకోకుండా జరిగిన ఒక సంఘటన వలన అక్షయ్, కావ్య విడిపోవాల్సి వస్తుంది. దాని తర్వాత అక్షయ్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఆ ప్రేమికులు తిరిగి ఒకటవుతారా? అసలు ఏం జరుగుతుంది?

నటీనటులు:

రౌడీ బాయ్స్ ద్వారా ఆశిష్ డెబ్యూ చేసాడు. తన డ్యాన్స్ మూవ్స్, యాక్షన్ లో ఈజ్ తో ఆశిష్ ఇంప్రెస్ చేస్తాడు. నటన పరంగా ఆశిష్ కాలేజ్ విద్యార్థిగా డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. అయితే నటన పరంగా ఇంకా ఆశిష్ మెరుగవ్వాల్సి ఉంది. కొన్ని క్లోజప్ షాట్స్ లో ఆశిష్ కెమెరా ఫియర్ తెలుస్తోంది. అది అధిగమించాలి.

అనుపమ పరమేశ్వరన్ చూడటానికి బాగుంది. ఆశిష్ తో అనుపమ కెమిస్ట్రీ బాగుంది. లీడ్ పెయిర్ మధ్య రొమాంటిక్ సీన్స్ యూత్ ను అట్రాక్ట్ చేస్తాయి. గ్యాంగ్ లీడర్ గా సాహిదేవ్ విక్రమ్ నటన బాగుంది. కార్తీక్ రత్నం, ఇంకా సహాయ పాత్రల్లో నటించిన వారు డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు.

సాంకేతిక నిపుణులు:

శ్రీ హర్ష కొనుగంటి, హుషారుతో దర్శకుడిగా అరంగేట్రం చేసాడు. ఇక హర్ష ఈసారి రౌడీ బాయ్స్ తో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ను ఎంచుకోవడాన్ని మెచ్చుకోవచ్చు. స్క్రీన్ ప్లే విషయంలో మరింతగా వర్కౌట్ చేసి ఉంటే ఔట్పుట్ మరింత ఎఫెక్టివ్ గా ఉండే అవకాశముంది.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం బాగుంది. కొన్ని పాటలు ఇంప్రెస్ చేస్తాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో, ముఖ్యంగా హీరో ఎలివేషన్ సీన్స్ లో దేవి వర్క్ స్టాండౌట్ గా నిలుస్తుంది. సినిమాటోగ్రఫీ వర్క్ నీట్ గా సాగింది. ఎడిటింగ్ కూడా అంతే. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గ స్థాయిలో ఉన్నాయి.

పాజిటివ్ పాయింట్స్:

  • ఆశిష్, అనుపమ మధ్య కెమిస్ట్రీ
  • అనుపమ పరమేశ్వరన్

నెగటివ్ పాయింట్స్:

  • స్లో నరేషన్
  • సరైన కాన్ఫ్లిక్ట్ పాయింట్ లేకపోవడం

విశ్లేషణ:

రౌడీ బాయ్స్ కొన్ని ప్లస్ పాయింట్స్ తో సాగే ఒక యూత్ ఫుల్ రొమాంటిక్ డ్రామా. అయితే రొటీన్ ట్రీట్మెంట్, గ్రిప్పింగ్ మూమెంట్స్ లేకపోవడం చిత్రాన్ని బిలో యావరేజ్ గా చేసాయి.

తెలుగుబులెటిన్ రేటింగ్: 2.25/5

Source: TeluguBulletin.com

The post రౌడీ బాయ్స్ రివ్యూ: అంచనాలు అందుకోలేకపోయారు appeared first on TeluguBulletin.com.

Related Articles

గుప్పెడంత మనసు జనవరి26 బుధవారం ఎపిసోడ్: దేవయానికి భారీ షాక్, జగతిని చూసి ఉప్పొంగిన మహేంద్ర మనసు

గుప్పెడంతమనసు జనవరి 26 బుధవారం ఎపిసోడ్ ధరణికి కాల్ చేసి మాట్లాడిన జగతి..ఫుడ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతుంది. ఆ ఫోన్ కాల్ విన్న గౌతమ్...మీరు...

Jairam Ramesh: ఆజాద్, గులాం కాదు .. పద్మ అవార్డు ప్రకటనపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ సెటైర్!

కాంగ్రెస్ సీనియర్ నేత, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్‌కు పద్మభూషణ్ ప్రకటించిన తర్వాత దీనిపై...

Covid 19 : మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్..!

థ‌ర్డ్ వేవ్ ప్ర‌భావం చాలా ఎక్కువ‌గా ఉంది. సామాన్యులు, సెల‌బ్రిటీలు చాలా మంది క‌రోనా బారిన ప‌డుతున్నారు. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో చాలా మంది ప్ర‌ముఖులు క‌రోనా ఎఫెక్ట్‌కి గుర‌య్యారు....

Latest Articles

‘ఆజాద్.. గులాం కాదు’: సహచరుడికి పద్మ అవార్డుపై జైరాం రమేశ్ వ్యంగ్యాస్త్రాలు

ప్రధానాంశాలు:పరోక్షంగా ఆజాద్‌ను బానిస అంటూ వ్యాఖ్యలు.అవార్డు తిరస్కరించిన బెంగాల్ మాజీ సీఎం.కాంగ్రెస్‌ అధినేత్రికి లేఖ రాసినవారిలో ఆజాద్.మంగళవారం కేంద్రం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో సీనియర్ కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్‌కు పద్మభూషణ్...

Russia-Ukraine Conflict: రష్యా-ఉక్రెయిన్ బార్డర్‌లో తీవ్ర ఉద్రిక్తతలు..ఎప్పుడు ఏమైనా జరగొచ్చు: పెంటగాన్

రష్యా, ఉక్రెయిన్ ఎపిసోడ్‌లో కీలక అప్‌డేట్‌ ఇది. ఆ రెండు దేశాల మధ్య ఎప్పుడు ఏమైనా జరగొచ్చు...