Wednesday, January 26, 2022

CM Jagan Sankranti : సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్ దంపతులు | CM Jagan Couple Participates In Sankranti Bhogi Celebrations

మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయానికి, రైతులకు మనమంతా ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి అని జగన్ అన్నారు.

CM Jagan Sankranti : తెలుగు వారి ముఖ్యమైన పండుగల్లో సంక్రాంతి ఒకటి. తెలుగు వాళ్లు ఎంతో ఘనంగా సంక్రాంతి జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి కోలాహలం నెలకొంది. ఇవాళ భోగి సందర్భంగా ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసంలోని గోశాల దగ్గర వేడుకలు నిర్వహించారు.

Omicron – Cyber attack: బీ కేర్ ఫుల్.. ఒమిక్రాన్‌నూ వదలని సైబర్ చీటర్లు.. క్లిక్ చేస్తే మొత్తం దోచేస్తారు..!

ఈ సంబరాలకు సీఎం జగన్ దంపతులు హాజరయ్యారు. సీఎం జగన్ సంప్రదాయ పంచె కట్టుతో కనిపించారు. గ్రామాల్లో సంక్రాంతి సందర్భంగా ఎలాంటి సంబరాలు కనిపిస్తాయో అన్నింటిని తాడేపల్లిలోని సీఎం నివాసంలో నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

భోగి మంటలు, హరిదాసులు, గంగిరెద్దులు, గోమాతలకు పూజలు, సంక్రాంతి నృత్యాలు, డప్పు మోతలు, కోలాటాలు, పిండివంటలు… ఇలా సీఎం నివాసంలో సంక్రాంతి శోభ వెల్లివిరిసింది. ఈ వేడుకల్లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Bad Cholesterol : శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే?

ఈ వేడుకలను ఆస్వాదించిన సీఎం జగన్.. ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయానికి, రైతులకు మనమంతా ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి అని జగన్ అన్నారు.Related Articles

మహేష్ బాబుతో మోహన్ బాబు.. ఇన్నేళ్లకు మళ్ళీ అలా కలవబోతున్నారా?

వరుస హిట్ సినిమాలతో సత్తా చాటుతూ టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. తన తదుపరి సినిమాలో మోహన్ బాబుతో తెర పంచుకోబోతున్నారని తెలుస్తోంది. దర్శకనిర్మాతలతో...

జిల్లా కలెక్టర్ ఆఫీసులలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ – Telugu Job Alerts 24

Collector Office Guntur Recruitment 2022 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, గుంటూరు జిల్లా కలెక్టర్ ఆఫస్ నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా...

చిరంజీవికి కరోనా.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తప్పించుకోలేకపోయానంటూ ట్వీట్…

కరోనా థర్డ్ వేవ్ ఇండస్ట్రీని వణికిస్తోంది. సినిమాల విడుదలకు సంబంధించిన ఇబ్బంది ఓవైపు.. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరగడం మరోవైపు. వెండితెర,...

Latest Articles

గుప్పెడంత మనసు జనవరి26 బుధవారం ఎపిసోడ్: దేవయానికి భారీ షాక్, జగతిని చూసి ఉప్పొంగిన మహేంద్ర మనసు

గుప్పెడంతమనసు జనవరి 26 బుధవారం ఎపిసోడ్ ధరణికి కాల్ చేసి మాట్లాడిన జగతి..ఫుడ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతుంది. ఆ ఫోన్ కాల్ విన్న గౌతమ్...మీరు...

Jairam Ramesh: ఆజాద్, గులాం కాదు .. పద్మ అవార్డు ప్రకటనపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ సెటైర్!

కాంగ్రెస్ సీనియర్ నేత, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్‌కు పద్మభూషణ్ ప్రకటించిన తర్వాత దీనిపై...