Wednesday, January 26, 2022

Vikarabad Forest : గుప్తనిధుల కోసం అటవీ ప్రాంతంలో తవ్వకాలు Vikarabad Forest

వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం పెద్ద ఎత్తున తవ్వకాలు జరిపారు.

Vikarabad Forest :  వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం పెద్ద ఎత్తున తవ్వకాలు జరిపారు. గ్రామస్తులు అత్యంత భక్తి దాయకంగా పూజించే దేవుని లొద్దిలోని రామలింగేశ్వరస్వామి లింగాన్ని పక్కకు తప్పించి నిలువెత్తు లోతు వరకు తవ్వకాలు జరిపారు.

గ్రామానికి చెందిన కొందరు అయ్యప్పస్వామి మాలధారులు శబరిమలై వెళ్ళే ముందు రోజు రామలింగేశ్వరస్వామి వారిని మొక్కేందుకు  అక్కడికి వెళ్ళగా వారు అక్కడ  తవ్వకాలు  చూసి షాకయ్యారు.  భారీ ఎత్తున గుమ్మడికాయలు,నిమ్మకాయలు చూసి భయపడిన అయ్యప్ప స్వాములు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే వెళ్ళి గ్రామంలోని పెద్దలకు ఈవిషయం చెప్పారు. దీంతో విషయం గ్రామమంతా పాకింది.

గ్రామస్తులంతా అక్కడికి వెళ్ళేసరికి  తవ్వకాల ఆనవాళ్లు లేకుండా చేసే ప్రయత్నం చేశారు దుండగులు. గుమ్మడి కాయలు, నిమ్మకాయలు కనిపించకుండా చేసి శివలింగాన్ని యధాస్థానంలో ఉంచి గుంత పూడ్చేశారు. ఈ తవ్వకం జరిగిన మరి కొంత దూరంలో మరో పెద్ద గుంత  తీసి ఉండడం గమనించారు గ్రామస్తులు.
Also Read : Weather Forecast : ఆంధ్రప్రదేశ్‌లో మరో 3 రోజుల పాటు వర్షాలు
అక్కడ ఉన్న ఆనవాళ్ళను బట్టి రోజుల తరబడి తవ్వకాలు జరిగి ఉంటాయని గ్రామస్థులు భావిస్తున్నారు.వందల ఏళ్ళ చరిత్ర ఉండి అత్యంత పవిత్రంగా పూజించే దైవ విగ్రహాలను గుప్త నిధుల కోసం ధ్వంసం చేయడం చాలా భాధాకరమని  గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దంటే తవ్వకాలు జరిపిన వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Related Articles

నల్లని మబ్బులు కమ్మిన ఆకాశంలా… ప్రగ్యా జైస్వాల్

అఖండ సినిమాతో మళ్లీ తెరమీదకు వచ్చింది ప్రగ్యా జైస్వాల్. ఆ సినిమా హిట్ కొట్టడంతో ప్రగ్యాకు మళ్లీ అవకావాలు పెరుగుతున్నాయి. -Image credit: PragyaJaiswal/Instagram

Actress Rani Chatterjee: కాంగ్రెస్‌లో చేరిన ప్రముఖ నటి రాణీ ఛటర్జీ… యూపీ ఎన్నికలే టార్గెట్!

Uttar Pradesh Assembly Election 2022: భోజ్‌పురి సినీ నటి రాణి ఛటర్జీ కాంగ్రెస్‌లో చేరారు. ప్రియాంక...

క‌మ‌ర్షియల్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ‌

ప్రధానాంశాలు:రవితేజ బర్త్ డే స్పెషల్వరుస సినిమాలతో బిజీగా ఉన్న రవితేజస్వయం కృషితో ఎదిగిన రవితేజమాస్ మ‌హారాజా ర‌వితేజ‌.. ఈ పేరులో తెలియ‌ని ఎన‌ర్జీ ఉంటుంది. సినీ ప‌రిశ్ర‌మ‌లో క‌ష్ట‌ప‌డి న‌టుడి స్థాయి...

Latest Articles

టాలీవుడ్ కి అచ్చిరాని స్టూవర్ట్ పురం

<p>స్టూవర్ట్ పురం అనగానే మన ముందు తరం వారిగుండె ఝళ్లు మనేది . ఆ ఊరి పేరు చెప్పగానే బందిపోటు దొంగలు గుర్తుకొచ్చేవారు . &nbsp;బ్రతుకుతెరువు కోసం కొంతమందీ ,సంప్రదాయం అంటూ...

మహేష్ బాబుతో మోహన్ బాబు.. ఇన్నేళ్లకు మళ్ళీ అలా కలవబోతున్నారా?

వరుస హిట్ సినిమాలతో సత్తా చాటుతూ టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. తన తదుపరి సినిమాలో మోహన్ బాబుతో తెర పంచుకోబోతున్నారని తెలుస్తోంది. దర్శకనిర్మాతలతో...