Wednesday, January 26, 2022

ఈ సారి ఐపీఎల్‌ అక్కడేనా..?

ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు.. కరోనా నేపథ్యంలో ఈ పొట్టి ఫార్మాట్‌ను స్టేడియాలకు వెళ్లి ప్రత్యక్షంగా చూసే అవకాశం లేకుండా పోయింది.. ఇక, స్వదేశంలోనూ మ్యాచ్‌లు జరిగే పరిస్థితి లేదు.. ఎక్కడ మ్యాచ్‌ జరిగినా.. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడాల్సిందే.. అయితే, ఐపీఎల్‌ను క్యాష్‌ చేసుకునేందుకు ఎప్పటికప్పుడు హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు.. ఇలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూనే ఉన్నాయి.. మరోవైపు భారత్‌లో కరోనా థర్డ్‌ వేవ్‌ కల్లోలం సృష్టిస్తోన్న సమయంలో.. ఈ ఐపీఎల్‌ సీజన్‌ కూడా ఇక్కడ జరిగే పరిస్థితి లేదు.. అసలు టోర్నీ ఉంటుందా? లేదా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి.. ఈ సమయంలో.. ఇప్పుడు ప్రపంచాన్ని టెన్షన్‌ పెడుతోన్న ఒమిక్రాన్‌ వేరియంట్ వెలుగుచూసిన సౌతాఫ్రికాలోనే ఐపీఎల్‌ 15వ ఎడిషన్‌ను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తుందనే ప్రచారం సాగుతోంది.. వీలైతే సౌతాఫ్రికా.. అక్కడ కూడా కుదరకపోతే శ్రీలంకలో నిర్వహించే అవకాశం ఉందని సమాచారం.

Read Also: ఇక వైసీపీ అరాచకాల్ని సహించం.. ఒక్కరిపై చేయి పడినా తీవ్ర పరిణామాలు..

ఐపీఎల్‌ మ్యాచ్‌లు అన్నీ ముంబైలోనే నిర్వహించాలని ఉద్దేశంతో బీసీసీఐ ఉందన్న ప్రచారం కూడా సాగింది.. కానీ, కరోనా విజృంభణ నేపథ్యంలో.. ఐపీఎల్‌ వేదికను మార్చాలనే ప్లాన్‌లో బీసీసీఐ ఉందట.. గత సీజన్‌ కోవిడ్‌ దెబ్బతో మధ్యలోనే టోర్నీ ఆగిపోయిన పరిస్థితి.. మిగతా మ్యాచ్‌లను యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో నిర్వహించింది బీసీసీఐ.. ఈసారి కూడా అలాంటి పరిస్థితే వస్తే.. యూఏఈకే వెళ్లాలనే ప్లాన్‌ ఉన్నా.. ఇదే సమయంలో సౌతాఫ్రికాను కూడా మరో ప్రత్యామ్నాయంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. కాగా, టీమిండియా ప్రస్తుతం సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఐపీఎల్‌ వేదికపై బీసీసీఐ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Related Articles

మహేష్ బాబుతో మోహన్ బాబు.. ఇన్నేళ్లకు మళ్ళీ అలా కలవబోతున్నారా?

వరుస హిట్ సినిమాలతో సత్తా చాటుతూ టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. తన తదుపరి సినిమాలో మోహన్ బాబుతో తెర పంచుకోబోతున్నారని తెలుస్తోంది. దర్శకనిర్మాతలతో...

జిల్లా కలెక్టర్ ఆఫీసులలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ – Telugu Job Alerts 24

Collector Office Guntur Recruitment 2022 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, గుంటూరు జిల్లా కలెక్టర్ ఆఫస్ నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా...

చిరంజీవికి కరోనా.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తప్పించుకోలేకపోయానంటూ ట్వీట్…

కరోనా థర్డ్ వేవ్ ఇండస్ట్రీని వణికిస్తోంది. సినిమాల విడుదలకు సంబంధించిన ఇబ్బంది ఓవైపు.. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరగడం మరోవైపు. వెండితెర,...

Latest Articles

గుప్పెడంత మనసు జనవరి26 బుధవారం ఎపిసోడ్: దేవయానికి భారీ షాక్, జగతిని చూసి ఉప్పొంగిన మహేంద్ర మనసు

గుప్పెడంతమనసు జనవరి 26 బుధవారం ఎపిసోడ్ ధరణికి కాల్ చేసి మాట్లాడిన జగతి..ఫుడ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతుంది. ఆ ఫోన్ కాల్ విన్న గౌతమ్...మీరు...

Jairam Ramesh: ఆజాద్, గులాం కాదు .. పద్మ అవార్డు ప్రకటనపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ సెటైర్!

కాంగ్రెస్ సీనియర్ నేత, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్‌కు పద్మభూషణ్ ప్రకటించిన తర్వాత దీనిపై...