Wednesday, January 26, 2022

Pension : గుడ్ న్యూస్‌.. అన్నదాతల కోసం తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. త్వరలోనే నెలనెలా పింఛన్ స్కీం ! | The Telugu News

Pension for farmers : రాష్ట్రంలోని అన్నదాతలను ఆదుకునేందుకు తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వ్యవసాయం దండగ కాదు పండగ అని ప్రతీరైతు అనుకునేలా వారి బాగుకోసం నెలనెలా పింఛన్ పథకాన్ని తీసుకుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమైనట్టు సమాచారం. రానున్న బడ్జెట్‌లో రైతులకు పింఛన్ స్కీం అమలు చేస్తే రాష్ట్ర ఖజానాపై ఎంత భారం పడుతుంది. ఈ స్కీమ్ వర్కౌట్ అవుతుందా? లేదా అనే సాధ్యాసాధ్యాలపై ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్టు తెలిసింది. కొండపోచమ్మసాగర్‌ ప్రారంభోత్సవం సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. త్వరలోనే రైతులకు శుభవార్త చెబుతానని ప్రకటించారు.

ప్రస్తుతం తెలంగాణ సర్కార్ పైన రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉపఎన్నికలు వచ్చిన ప్రతీసారి చివరి గింజ వరకు వడ్లను మేము కొంటామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు ఇప్పుడు మాటమార్చారు. కేంద్రం ధాన్యం కొనడం లేదని అందుకే యాసంగిలో వరి వేయొద్దని సర్కార్ రైతులను బెదిరిస్తున్నది. ధాన్యాన్ని సర్కార్ కొనకపోవడంతో పలువురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రైతుల్లోనే కాకుండా నిరుద్యోగులు, ఉద్యోగులు ఇలా ప్రతీ ఒక్కరు టీఆర్ఎస్‌పై వ్యతిరేకత చూపిస్తున్నారు.

cm kcr announce monthly pension scheme to farmers

Pension for farmers : ప్రజల్లో వ్యతిరేకత పోగొట్టెందుకేనా..?

ఈ నేపథ్యంలోనే పార్టీపై, మంత్రులు, నేతలపై ఉన్న వ్యతిరేకతను డైవర్ట్ చేసేందుకు కేసీఆర్ రైతులకు పింఛన్ ఇస్తానని మరో కొత్త నాటకానికి తెరలేపారని అంతా అనుకుంటున్నారు. దళితబంధు మాటలకే పరిమితమైంది. రైతు బంధు కొందరు రైతులకు మాత్రమే వస్తోంది. అందరికీ రావడం లేదు. దీంతో అన్నదాతలు ఆగ్రహంగా ఉన్నారు. వారిని సముదాయించేందుకు కేసీఆర్ నెలనెలా పింఛన్ స్కీం తెచ్చారని, కానీ ఇది అమలుకు నోచుకునేనా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, 47 ఏళ్లు నిండిన చిన్న, సన్నకారు రైతులు ఆ పథకానికి అర్హులు. వీరికి నెలనెలా రూ.2,016 పింఛన్‌ ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో రైతుబంధు పథకం లబ్దిదారులు 67 లక్షల మంది ఉండగా, వీరిలో 47 ఏళ్లు నిండిన వారు ఎంత, 49 ఏళ్లు నిండిన వాళ్లు ఎంతమంది ఉన్నారనే విషయంపై పూర్తి వివరాలను సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. 3 నుంచి 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు పింఛన్‌ ఇచ్చే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.

Related Articles

జిల్లా కలెక్టర్ ఆఫీసులలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ – Telugu Job Alerts 24

Collector Office Guntur Recruitment 2022 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, గుంటూరు జిల్లా కలెక్టర్ ఆఫస్ నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా...

గుప్పెడంత మనసు జనవరి26 బుధవారం ఎపిసోడ్: దేవయానికి భారీ షాక్, జగతిని చూసి ఉప్పొంగిన మహేంద్ర మనసు

గుప్పెడంతమనసు జనవరి 26 బుధవారం ఎపిసోడ్ ధరణికి కాల్ చేసి మాట్లాడిన జగతి..ఫుడ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతుంది. ఆ ఫోన్ కాల్ విన్న గౌతమ్...మీరు...

Jairam Ramesh: ఆజాద్, గులాం కాదు .. పద్మ అవార్డు ప్రకటనపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ సెటైర్!

కాంగ్రెస్ సీనియర్ నేత, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్‌కు పద్మభూషణ్ ప్రకటించిన తర్వాత దీనిపై...

Latest Articles

Covid 19 : మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్..!

థ‌ర్డ్ వేవ్ ప్ర‌భావం చాలా ఎక్కువ‌గా ఉంది. సామాన్యులు, సెల‌బ్రిటీలు చాలా మంది క‌రోనా బారిన ప‌డుతున్నారు. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో చాలా మంది ప్ర‌ముఖులు క‌రోనా ఎఫెక్ట్‌కి గుర‌య్యారు....

‘ఆజాద్.. గులాం కాదు’: సహచరుడికి పద్మ అవార్డుపై జైరాం రమేశ్ వ్యంగ్యాస్త్రాలు

ప్రధానాంశాలు:పరోక్షంగా ఆజాద్‌ను బానిస అంటూ వ్యాఖ్యలు.అవార్డు తిరస్కరించిన బెంగాల్ మాజీ సీఎం.కాంగ్రెస్‌ అధినేత్రికి లేఖ రాసినవారిలో ఆజాద్.మంగళవారం కేంద్రం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో సీనియర్ కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్‌కు పద్మభూషణ్...