Tuesday, January 25, 2022

30 ఏళ్లకే క్రికెటర్ రిటైర్మెంట్.. బోర్డు నిర్ణయమే కారణమా?

శ్రీలంక క్రికెటర్ భానుక రాజపక్స సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 30 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డుకు లేఖ ద్వారా తెలియజేశాడు. కుటుంబ పరిస్థితులు, వ్యక్తిగత కారణాల వల్ల తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు పేర్కొన్నాడు. శ్రీలంక బోర్డు కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది.

Read Also: కోహ్లీ వందో టెస్టుపై గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు

అయితే శ్రీలంక బోర్డు కొత్తగా ప్రవేశపెట్టిన ఫిట్‌నెస్ మార్గదర్శకాల కారణంగానే రాజపక్స రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. శ్రీలంక బోర్డు నూతన మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఆటగాడు 8.10 నిమిషాల్లో రెండు కిలోమీటర్లు పరుగెత్తాలి. ఒకవేళ పరుగు పూర్తికాకపోతే వేతనాల్లో కోత పడనుంది. కాగా 2021 జూలైలో వన్డే క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన రాజపక్స.. కేవలం ఆరు నెలలు మాత్రమే మాత్రమే జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. మొత్తంగా తన కెరీర్‌లో 5 వన్డేలు, 18 టీ20లు ఆడి 409 పరుగులు సాధించాడు. ఇందులో మూడు అర్ధశతకాలు ఉన్నాయి. ఇటీవల దుబాయ్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లోనూ లంక జట్టులోనూ రాజపక్స ఉన్నాడు. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన మూడో శ్రీలంక బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. టీ20 ప్రపంచకప్‌లో మొత్తం 8 మ్యాచ్‌లు ఆడి 155 పరుగులు చేశాడు.

Related Articles

పెళ్లైన రోజే పోలీస్ స్టేషన్‌‌కు వధూ,వరులు… కోవిడ్ ఆంక్షలు ఉల్లంఘించారని అరెస్ట్

ప్రధానాంశాలు:గుజరాత్‌‌లో కొత్త పెళ్లి జంట అరెస్ట్అర్ధరాత్రి సమయంలో ఇంటికి వస్తున్న కుటుంబంకోవిడ్ ఆంక్షలు ఉల్లంఘించారని ఆరోపణగుజరాత్‌లో అప్పుడే పెళ్లైన ఓ జంటను కోవిడ్ ఆంక్షలు కష్టాల్లో పడేశాయి. నైట్ కర్ఫ్యూను ఉల్లంఘించినందుకు...

Padma Awards 2022 : మొగులయ్యకు పద్మశ్రీ.. స్పందించిన పవన్ కళ్యాణ్

ప్రధానాంశాలు:పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రంకిన్నెర వాయిద్య కారుడు మొగులయ్యకు పద్మశ్రీపద్మ అవార్డులపై స్పందించిన పవన్ కళ్యాణ్భీమ్లా నాయక్ పాటతో దర్శనం మొగులయ్య గొప్పదనం, కిన్నెర వాయిద్య పరికరం గురించి నేటి తరానికి...

నా భార్య నమితకి శరత్‌ బాబుతో పెళ్లేంటి?.. మా లైఫ్‌లో ఇదే వరస్ట్: నమిత భర్త వీరూ చౌదరి ఫస్ట్ రియాక్షన్

గుజరాతీ భామ నమితకి తెలుగు, తమిళ్‌లో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తమిళనాడులో అయితే ఈ బొద్దుగుమ్మకి ఏకంగా గుడిలే కట్టిపూజించేశారు. తెలుగులో సొంతం, జెమిని, బిల్లా, సింహా వంటి చిత్రాల్లో...

Latest Articles

పద్మ అవార్డుల ప్రకటన.. బిపిన్‌ రావత్‌కు పద్మవిభూషణ్‌, 17 మందికి పద్మభూషణ్

ప్రధానాంశాలు:128 మందికి పద్మ అవార్డులు17 మందికి పద్మభూషణ్107 మందికి పద్మశ్రీ పురస్కారాలుగణతంత్ర దినోత్సవం సందర్భంగా పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. పద్మ అవార్డుల...

Gudivada Casino Politics: గోవా కల్చర్ ఏంటో?.. బీజేపీ నేతకు మంత్రి నాని స్ట్రాంగ్ కౌంటర్..

Casino Politics - Minister Nani: బీజేపీ(BJP) ఆంధ్రప్రదేశ్(Andhra PradesH) అధ్యక్షుడు సోము వీర్రాజుపై మంత్రి కొడాలి.. ...